ధాన్యం కొనుగోలులో చిత్తశుద్ధి లేదు
ప్రశాంతంగా ఏపీ ఈ సెట్
పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలోకి అవకాశం కల్పించే ఏపీ ఈ సెట్ ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రశాంతంగా జరిగింది. 8లో u
పీవీఎల్ నర్సింహరాజు
ఆకివీడు: కూటమి ప్రభుత్వం రైతుల్ని నిండా ముంచిందని.. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయని వైఎస్సార్‌సీపీ ఉండి ఇన్‌చార్జి పీవీఎల్ నర్సింహరాజు అన్నారు. చెరుకుమిల్లి గ్రామంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతుల కోసం ఒక్క సంచి కూడా కొనుగోలు చేయలేదన్నారు. చిల్లుల సంచులతో ధాన్యాన్ని ఎగుమతులు చేసి మిల్లులకు తోలాల్సి వస్తుందన్నారు. దాళ్వా ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వల్లే రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. నియోజకవర్గంలో రైతులవద్ద 30 శాతం ధాన్యం ఉందన్నారు. కొంత పంటమీద ఉంటే, మరి కొంత కళ్లాల్లో, నెట్లుపైనా ఉందన్నారు. జగన్ ప్రభుత్వంలో రైతుల వద్ద ప్రతి గింజ కొనుగోలు చేశామని చెప్పారు. సంచుల విషయంలో జేసీకి వినతి పత్రం అందజేశామని చెప్పారు. మండల వైసీపీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య మాట్లాడుతూ తడిసిన ధాన్యానికి మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కమిటీ అధ్యక్షుడు అంబటి రమేష్, మంతెన సునీల్‌కుమార్ వర్మ, సర్పంచ్ నందమూరి ప్రకాశం, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సైదాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


