అకాల కష్టం.. అపార నష్టం
భీమవరం: జిల్లాలో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. పిడుగులు, ఉరుములతో భయపెట్టడంతో కళ్లాల్లోని పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలు చోట్ల చేలల్లోనే ధాన్యం రాశులు ఉండటంతో బరకాలు కప్పినా బస్తాలు తడిచిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు వాహన రాకపోకలు స్తంభించాయి.
60 వేల ఎకరాల్లో పంట చేలలోనే..
జిల్లాలో దాళ్వా సీజన్‌లో దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయగా ఇప్పటివరకు సుమారు 1.60 లక్షల ఎకరాల్లో పంట మాసూళ్లు చేశారు. జిల్లావ్యాప్తంగా 9.20 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుదని అధికారులు అంచనా వేయగా వాతావరణం అనుకూలించడంతో ధాన్యం దిగు బడి 10 లక్షల టన్నులకు పైగా ఉంటుందని రైతు లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం 6 లక్షల ట న్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇవ్వడంతో ఇప్పటివరకు కేవలం సుమారు 4.40 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దీనితో ఇంకా దాదాపు 5.50 లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్దనే ఉంది. సంచులు లేకపోవడం, తేమ శాతం పేరుతో మిల్లర్లు ధాన్యం సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం కళ్లాలోనే మిగిలిపోయి భారీ వర్షానికి తడిచి రైతులు నష్టపోతున్నారు. ధాన్యం పట్టుబడికి మరో 30 లక్షల సంచులు సరఫరా చేయాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటికీ స్పందన లేదు.
పంట కోసం పాట్లు
ధాన్యం పట్టుబడులు లేకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే కళ్లాలు, రోడ్లు వెంబడి రాశులు చేసి రైతులు బరకాలు కప్పి కాపాడుకుంటున్నారు. పల్లపు ప్రాంతాల్లోని ధాన్యాన్ని గట్టుకు తెచ్చుకోవడం, మైకా బరకాలు కప్పి తడవకుండా కాపాడుకోడానికి ఇబ్బందులు పడుతున్నారు. దిగుబడులు బాగున్నా పంటను అమ్ముకోలేకపోతున్నామనే ఆవేదనలో రైతులు ఉన్నారు.
ఏకాధాటిగా.. కుండపోతగా..
ఆకాశం మేఘావృతమే ఉద యం 8 గంటల సమయంలో ఏకధాటిగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు, భీకర గాలులతో కుండపోత వర్షం పడింది. పలు ప్రాంతాల్లో దాదాపు 3 గంటలకు పైగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. భీమవరంలోని నర్సయ్య అగ్రహారంలో చెట్టుకూలడంతో ఆటో ధ్వంసమైంది. పలు ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగిపొర్లాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, తీగలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ స్తంభాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది.
నరసాపురం : జలమయమైన రోడ్డు
జడిపించిన వాన
జిల్లాలో గాలివాన బీభత్సం
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
లోతట్టు ప్రాంతాలు జలమయం
పంటను కాపాడుకునేందుకు రైతుల పాట్లు
60 వేల ఎకరాల్లో పంట చేలల్లోనే..
రైతుల వద్దే 5.50 లక్షల టన్నుల ధాన్యం
అకాల కష్టం.. అపార నష్టం
అకాల కష్టం.. అపార నష్టం
అకాల కష్టం.. అపార నష్టం
అకాల కష్టం.. అపార నష్టం
అకాల కష్టం.. అపార నష్టం
అకాల కష్టం.. అపార నష్టం


