సాక్షిపై దాడులు సిగ్గుచేటు | - | Sakshi
Sakshi News home page

సాక్షిపై దాడులు సిగ్గుచేటు

Apr 24 2025 8:34 AM | Updated on Apr 24 2025 8:34 AM

సాక్ష

సాక్షిపై దాడులు సిగ్గుచేటు

దాడికి పాల్పడ్డవారిని శిక్షించాలి : సీపీఎం

ఏలూరు (టూటౌన్‌): సాక్షి పత్రికా కార్యాలయంపై దాడిని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తగిన విచారణ జరిపి, నిజానిజాలు వెలికి తీసి, అందుకు కారణమైనవారిని, దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ ఎవరిౖపైనెనా కొన్ని పత్రికలు అవాస్తవాలు ప్రచురిస్తే వాటిని ఖండించేందుకు అనేక మార్గాలున్నాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు దిగడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. సమస్య ఉంటే చట్ట ప్రకారం వెళ్ళాలేగాని, రాజ్యాంగాన్ని గౌరవించి, ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఇలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని రవి కోరారు.

ఏలూరు టౌన్‌ : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ బాధితులకు న్యాయం జరిగేలా పనిచేసే ఫోర్త్‌ ఎస్టేట్‌పై దాడులు సిగ్గుచేటని, ఇలాంటి విష సంస్కృతికి చెక్‌ పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేపీకే కిషోర్‌, టైమ్స్‌ కిషోర్‌ అన్నారు. ఏలూరు సాక్షి జిల్లా కార్యాలయం వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం విధ్వంసానికి నిరసనగా.. ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. బుధవారం ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ నుంచి ర్యాలీగా ఏలూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న జర్నలిస్టులు కొద్దిసేపు దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రిక స్వేచ్ఛను హరిస్తూ పత్రికా కార్యాలయాలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని పేర్కొన్నారు. డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సాక్షి కార్యాలయంలోకి అక్రమ చొరబడి, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ధ్వంసం ఘటనపై విచారణ చేయాలని, నిందితులను గుర్తించి కేసులు నమోదు చేయాలని కోరారు. డీఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ మరోసారి ఏలూరులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ పర్యవేక్షణలో నిందితులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజలకు నష్టం

ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేపీకే కిషోర్‌, టైమ్స్‌ కిషోర్‌ మాట్లాడుతూ ... ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతారణాన్ని చెడగొట్టేలా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవటం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రిక, మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజలు నష్టపోతారని, బాధితులకు న్యాయం దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఏదైనా తప్పు జరిగితే దానిపై రాజకీయ నేతలు, ప్రతినిధులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి తప్ప దాడులు చేయటం సరైన విధానం కాదన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజు, ఎలక్ట్రానిక్‌ మీడియా నాయకులు భరత్‌ మాట్లాడుతూ పత్రిక స్వేచ్చను పరిరక్షించేందుకు అధికారులు తమవంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. ప్రజాప్రతినిధులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, వారే దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడం ఏమాత్రం సమర్ధనీయం కాదని అభిప్రాయపడ్డారు. ఏపీయూడబ్ల్యూజే పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు వీఎస్‌ సాయిబాబా, మహిళా జర్నలిస్ట్‌ కొమ్మిన రత్నకుమారి మాట్లాడుతూ ఏలూరులోని సాక్షి కార్యాలయంపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు సంయమనంతో వ్యవహరించాలని, ఇష్టారాజ్యంగా దౌర్జన్యాలకు పాల్పడటం మంచి విధానం కాదన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఉర్ల శ్రీనివాస్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ఉపాధ్యక్షుడు పోతురాజు, పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్‌, ఏపీపీజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే రియాజ్‌, జర్నలిస్ట్‌ యూనియన్‌ నాయకులు కే.వంశీ, శ్యామ్‌, ఎం.రాజేష్‌కుమార్‌, కే.శ్రీనివాస్‌, కర్రి అప్పలరాజు, బీ.రాము, వైవీ శ్రీనివాస్‌, టీవీఆర్‌కే ప్రసాద్‌, ఆర్‌.వెంకటనాయుడు, ఏడుకొండలు, కే.వినోద్‌కుమార్‌, అమీర్‌ పాషా, గంజి చంటి, బీ.భరత్‌కుమార్‌, కురెళ్ళ కిషోర్‌, ఇబ్రహీం, ప్రసాద్‌రెడ్డి, ప్రసాద్‌, బలరాం, గాంధీ తదితరులు ఉన్నారు.

పత్రికా స్వేచ్ఛను హరించేలా దౌర్జన్యాలు

దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి

ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏలూరులో నిరసన

సాక్షిపై దాడులు సిగ్గుచేటు1
1/1

సాక్షిపై దాడులు సిగ్గుచేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement