నరసాపురం జిల్లా జడ్జిగా వాసంతి
నరసాపురం : నరసాపురం 10వ అదనపు జిల్లా జడ్జిగా ఎ.వాసంతి ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ జిల్లా జడ్జిగా పనిచేసిన విజయదుర్గ విశాఖలోని ఏసీబీ కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న తణుకు 4వ జిల్లా జడ్డి డి.సత్యవతి నుంచి వాసంతి బాధ్యతలు చేపట్టినట్టు కోర్టు పరిపాలనా అధికారి డి.నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు.
మాలలకు కూటమి ద్రోహం
పెనుగొండ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని మాల సంఘాల జేఏసీ నాయకుడు ఉన్నమట్ల మునిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆచంట మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొడమంచిలి గ్రామంలోఅంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాలల ఆక్రోశానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి కులాల మధ్య చిచ్చుపెట్టడమే తప్ప సామాజిక న్యాయం కూటమి ప్రభుత్వానికి చేతకాదని విమర్శించారు. ఆర్డినెన్స్‌కు టీడీపీ మాల నాయకులు మ ద్దతు పలకడం మాలజాతికి ద్రోహం చేసినట్లేన ని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ చైర్మన్ సుంకర సీతారామ్, గౌరవాధ్యక్షుడు బీరా మధు, మండల జేఏసీ నాయకుడు కోట వెంకటేశ్వరరావు, జెంట్రీ శ్రీను, మట్టా చంటి, గుండే నరేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పీజీఆర్‌ఎస్
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం యథావిధిగా ప్రజాసమస్య ల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే డివిజన్, మండల స్థాయిల్లో కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఇళ్ల బాధితులకు ప్రత్యామ్నాయం చూపాలి
భీమవరం: ఉండి ఎమ్మెల్యే ప్రజల పట్ల వ్య వహరిస్తున్న తీరును ఏపీ కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ విమర్శించింది. పాలకోడేరు మండలం ఏఎస్‌ఆర్ నగర్‌లో పేదల ఇళ్లను ప్రభు త్వం అక్రమంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి ఎం.రామాంజనేయులు ఆది వారం ప్రకటన విడుదల చేశారు. ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల్లో నివసించే పేదలను తరిమికొట్టి, ఇళ్లను అక్రమంగా కూలగొట్టడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే రఘురామకృష్టరాజు తీరు అర్థమవుతుందన్నారు. అభివృద్ధికి అడ్డంగా పేదల ఇళ్లే కనిపిస్తున్నాయా అని ఎండగట్టారు. జిల్లాలో నీటి కాలుష్యం, వ్యర్థ కాలుష్యం, ఆహార కాలుష్యాన్ని అరికట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ కాలువ గట్లు, రోడ్లు పక్కన నివసించే ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మించి ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు.
పేద ముస్లింల కోసమే వక్ఫ్ చట్టం
భీమవరం: పేద ముస్లింలకు న్యాయం జరగాలనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆదివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ ముద్రించిన వక్ఫ్ సవరణ చట్టం ప్రయోజనాలను తెలియజెప్పే కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 20 వేల కరపత్రాలను అన్ని మండలాల అధ్యక్షులకు పంపిస్తామని, ముస్లింలలో ఈ చట్టంపై ఉన్న సందేహాలు తొలగిపోయేలా అన్ని వివరాలు ఇందులో పొందుపరిచినట్టు జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అ న్నారు. భీమవరం తూర్పు అధ్యక్షుడు అడ బాల శివ, పడమర అధ్యక్షుడు వబిలిశెట్టి ప్రసాద్, షేక్ మొహద్దీన్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, గోవర్ధన్ కుమార్ పాల్గొన్నారు.
నరసాపురం జిల్లా జడ్జిగా వాసంతి
నరసాపురం జిల్లా జడ్జిగా వాసంతి


