కారును ఢీకొన్న లారీ.. విద్యార్థి మృతి
కొల్లేరు ప్రజలను రక్షించాలని డిమాండ్
అధికారుల ఆంతర్యం ఏమిటో
జంగారెడ్డిగూడెం: తమ స్నేహితుడి పుట్టినరోజు జరుపుకొని భద్రాచలం శ్రీరామచంద్రుడిని దర్శించుకునేందుకు బయలుదేరిన ఇంజనీరింగ్ విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఒకే కారులో బయలుదేరారు. వీరిలో రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతిచెందగా, ముగ్గురు విద్యార్థులకు తీవ్ర, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శశి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కొయ్యలగూడెం మండలం అంకాలగూడేనికి చెందిన కోమటికుంట ప్రమోద్, కొత్తూరు నిర్వాసిత కాలనీకి చెందిన చింత రాహుల్ కృష్ణ తేజ, విజయనగరం జిల్లా వీరసాగరానికి చెందిన జాగరాన హేమంత్, బుట్టాయగూడెం కొత్తపేటకు చెందిన గరికపాటి హరిహరన్, కొయ్యలగూడెం తూర్పుపేటకు చెందిన బెల్లాన బాల అజయ్ కుమార్, జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన చిన్నం శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లా పాలంగికి చెందిన దుంగా నరేష్, టి.నరసాపురం మండలం మెట్టగూడేనికి చెందిన కోమటి స్వామి (20) ఒక కారును సెల్ఫ్ డ్రైవింగ్ పద్ధతిన అద్దెకు తీసుకుని బయలుదేరారు. వీరిలో ఏడుగురు మాత్రం తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరగా, కొయ్యలగూడెంలో కోమటికుంట ప్రమోద్‌ను ఎక్కించుకున్నారు. కారును బెల్లాన బాల అజయ్‌కుమార్ నడుపుతున్నాడు.
కారు అదుపు తప్పి.. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయికి వచ్చేసరికి కారు అదుపు తప్పి ఎడమ వైపు మార్జిన్‌లోకి దిగిపోయింది. దీంతో కారు నడుపుతున్న అజయ్‌కుమార్ వెంటనే కారును అదుపు చేసేందుకు కుడివైపునకు వేగంగా తిప్పాడు. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి అశ్వారావుపేట వైపు వెళుతున్న కారు తిరిగి జంగారెడ్డిగూడెం వైపునకు తిరిగి పోయింది. అదే సమయంలో అశ్వారావుపేట నుంచి వేగంగా వస్తున్న లారీ కారును వెనుక భాగంలో కుడివైపున బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చొన్న కోమటి స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే కోమటికుంట ప్రమోద్, రాహుల్ కృష్ణతేజ, హేమంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో హరిహరన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ముందు సీట్లో కూర్చున్న చిన్నం శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అజయ్‌కుమార్, దుంగ నరేష్ సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం సీఐ వి.కృష్ణబాబు, ఎస్సై షేక్ జబీర్, సిబ్బంది జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారు వెనుక భాగం నుజ్జునుజ్జవడంతో కారులో ఇరుక్కుపోయిన వారిని స్థానికుల సహాయంతో బయటకు తీశారు.
క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలింపు
తీవ్రంగా గాయపడిన కోమటికుంట ప్రమోద్, రాహుల్ కృష్ణతేజ, హేమంత్‌లను ప్రాథమిక చికిత్స చేసి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హేమంత్ పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో అతన్ని ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. వీరిలో దుంగా నరేష్ పుట్టిన రోజు కావడంతో అతని పుట్టిన రోజు జరుపుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు వీరంతా బయలుదేరారు.
ఇంటికి వస్తానని చెప్పాడు
ప్రమాదంలో మృతిచెందిన టి.నరసాపురం మండలం మెట్టగూడేనికి చెందిన కోమటి స్వామి (20) బుధవారం రాత్రి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడని కుటుంబసభ్యులు, అతని బాబాయ్ తెలి పారు. మళ్లీ ఫోన్ చేసి.. ఫ్రెండ్స్‌తో కలసి భద్రాచలం వెళుతున్నానని చెప్పగా, వద్దు ఇంటికి వచ్చేయ్ అందరం కలిసి వెళదామని అన్నానని, అయినా స్నేహితులతో భద్రాచలం బయలుదేరి మృత్యువాతకు గురయ్యాడని ఆయన బోరున విలపించారు.
ఏలూరు (టూటౌన్): కొల్లేరు ప్రజలను రక్షించాలని, ఆక్వా రంగాన్ని కాపాడాలని, రొయ్యల రైతులను ఆదుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న భారాలు ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర నాయకులు బి.బలరాం, మంతెన సీతారాం డిమాండ్ చేశారు. స్థానిక పవరుపేటలోని ఉద్దరాజు రామం భవనంలో గురువారం నాడు సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు మొడియం నాగమణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు ప్రజా సమస్యలపై తీర్మానాలు చేసి ఆమోదించారు. ముఖ్యవక్తలుగా విచ్చేసిన సీపీఎం రాష్ట్ర నాయకులు బి.బలరాం, మంతెన సీతారాం మాట్లాడుతూ కొల్లేరును 5 నుంచి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజలకు ఉపాధి కల్పించాలని, సొసైటీలు, జిరాయితీ భూములను పునరుద్ధరించాలని, మిగులు భూములు కొల్లేరు పేదలకు పంచాలని, కొల్లేరు గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని కోరారు.
ఆక్వారంగంపై తీవ్ర ప్రభావం
అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ప్రతీకార సుంకాల పేరుతో భారత్ ప్రభుత్వంపై పెట్టిన భారం ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ఆక్వా రైతాంగంపై తీవ్రమైన ప్రభావం చూపిందని, తద్వారా రొయ్యల రైతులు నష్టాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం 100 కౌంట్ కి చెందిన రొయ్యల ధర రూ.220 రూపాయలకు కొనాలని నిర్ణయించడం అన్యాయమని, ఆ ధరను రూ.270లకు పెంచాలని అన్నారు. అలాగే పట్టణాల్లో పెంచిన ఆస్తి (ఇంటి) పన్ను తగ్గించాలని, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని కోరారు. 2025–26 సంవత్సరాలకు సంబంధించి పట్టణాల్లో ఆస్తి పన్ను గత సంవత్సరంతో పోలిస్తే 15%, 2020–21 సంవత్సరాలతో పోల్చితే 30% పన్ను పెంచుతూ, గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. దీనివలన రూ.320 కోట్ల భారం పట్టణ ప్రజలపై పడుతుందని తెలిపారు. సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీ వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డీఎన్‌వీడీ ప్రసాద్, ఆర్. లింగరాజు, తెల్లం రామకృష్ణ, జి.రాజు, కె.శ్రీనివాస్, పి.రామకృష్ణ ఇతర జిల్లా నాయకులు ఎం.జీవరత్నం, ఎ.ఫ్రాన్సిస్, మడకం సుధారాణి, వై.నాగేంద్రరావు, ఎస్.మహాంకాళీరావు, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక వార్తలు
మరో ఐదుగురికి గాయాలు
దైవ దర్శనం కోసం భద్రాచలం వెళ్తుండగా ఘటన
వీరంతా తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్ విద్యార్థులు
కారును ఢీకొన్న లారీ.. విద్యార్థి మృతి
కారును ఢీకొన్న లారీ.. విద్యార్థి మృతి
కారును ఢీకొన్న లారీ.. విద్యార్థి మృతి
కారును ఢీకొన్న లారీ.. విద్యార్థి మృతి
కారును ఢీకొన్న లారీ.. విద్యార్థి మృతి
కారును ఢీకొన్న లారీ.. విద్యార్థి మృతి


