భీమవరం: ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ ఆమో దం తెలపడాన్ని నిరసిస్తూ భీమవరంలో గురువారం మాలసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తప్పుల తడకగా ఉన్న రాజీవ్ రంజన్‌మిశ్రా కమిషన్‌ను రద్దు చేసి హైకోర్టు జడ్జిలతో త్రిసభ్య కమిటీ వేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం మాలలను అణగదొక్కడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాలల జనాభా అధికమని మిశ్రా కమిషన్ మాలలను తక్కువగా చూపి ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లేళ్ల సుధామ, కేసీ రాజు, సుంకర సీతారామ్, గొల్ల రాజ్‌కుమార్, అంబటి ఆనందకుమార్, చింతల నాగరాజు, ఈర్లపాటి గోపి తదితరులు పాల్గొన్నారు.