
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయ రామరాజుకు వినతిపత్రం సమర్పించినట్టు వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ బదిలీల కోసం చేసే చట్టంలో సర్వీస్ పాయింట్లు ఏడాదికి ఒకటి ఇవ్వాలని, యూపీ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్‌లను యథాతథంగా కొనసాగించాలని కోరామని పేర్కొన్నారు. అలాగే కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలల నుంచి మా త్రమే మోడల్ ప్రైమరీ స్కూల్‌లోకి మూడు, నాలుగు, ఐదు తరగతులను విలీనం చేయా లని, మిగులు ఉపాధ్యాయులకు పాయింట్లు కేటాయించి బదిలీలకు అనుమతించాలని కోరామని తెలిపారు. ఎనిమిదేళ్లు కాకుండానే రేషనలైజేషన్‌కు గురయ్యే ఉపాధ్యాయులకు పూర్వ పా ఠశాల స్టేషన్ పాయింట్లు, సర్వీస్ పాయింట్, రేషనలైజేషన్ పాయింట్లు కేటాయించాలని కోరామని సుధీర్ తెలిపారు.