
హై ఫెర్పార్మెన్సు కంప్యూటింగ్ ప్రభావంపై అవగాహన
తాడేపల్లిగూడెం: రాబోయే కాలంలో హై ఫెర్మార్మెన్స్ కంప్యూటింగ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కాకినాడ జేఎన్‌టీ యూ కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్ విభాగం సహాయ ఆచార్యుడు డాక్టర్ ఉషాదేవి అన్నారు. హై ఫెర్మార్మెన్స్ కంప్యూటింగ్‌పై వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్, సిస్టమ్స్, హై ఫెర్మార్మెన్స్ కంప్యూటింగ్ ఇన్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ గురించి వివరించారు. ప్రిన్సిపాల్ రత్నాకర్‌రావు, టెక్నికల్ డైరెక్టర్ చెక్కా అప్పారావు, కో ఆర్డినేటర్ లోష్మా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గోవింద నామ స్మరణతో మార్మోగిన క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా అంటూ శ్రీవారి దీక్షాధారులు చేసిన భజనలు, గోవింద నామ స్మరణలతో చినవెంకన్న క్షేత్రం మార్మోగింది. మండలంలోని వెంకటకృష్ణాపురానికి చెందిన 30 మంది శ్రీవారి భక్తులు శనివారం మండల (41 రోజుల) దీక్షను చేపట్టారు. ముందుగా వారు ఆలయ ముఖ ద్వారం వద్దకు చేరుకోగా, అర్చకులు వారి మెడలో మాలలు వేశారు. అనంతరం వారంతా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 41 రోజుల పాటు తాము స్వామి దీక్షను చేపడతామని, ఆ తరువాత గిరి ప్రదక్షిణ చేసి, ఇరుముడులు సమర్పిస్తామని తెలిపారు.

హై ఫెర్పార్మెన్సు కంప్యూటింగ్ ప్రభావంపై అవగాహన