●
శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం పూజలు వైభవంగా, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పూజ అనంతరం మహిళలు చేతికి తోరణాలు కట్టుకుని ముత్తైదువులకు తోరణాలు కట్టి వాయినాలు, తాంబూళాలు అందజేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. సాయంత్రం సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. భీమవరంలో మావుళ్లమ్మ వారికి 9 లక్షల గాజులతో అలంకరణ చేశారు. మావుళ్లమ్మకు అజ్ఞాత భక్తులు సుమారు రూ. 11 లక్షల విలువ చేసే 108 బంగారు పుష్పాలను సమర్పించారు.
– సాక్షి నెట్‌వర్క్
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన డీఆర్, పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని, తాత్కాలిక భృతి 30 శాతం వెంటనే ప్రకటించాలని గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన సలహాదారు వీకే వీరారావు, ప్రధాన కార్యదర్శి వైవీఎస్ మూర్తి, జిల్లా కోశాధికారి వి.రామ్మోహన్‌లు డిమాండ్ చేశారు. పెన్షనర్ల జిల్లా కార్యవర్గ సమావేశం తాడేపల్లిగూడెం పట్టణంలో బ్రాంచ్ అధ్యక్షుడు బి.హరికుమార్ అధ్యక్షతన జరిగింది. వక్తలు మాట్లాడుతూ మూడు డీఆర్ బకాయిలతో సహ అన్ని బకాయిలు ప్రకటించాలని, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆర్థిక నివేదిక, కార్యదర్శి నివేదికలను సభలో ఏకగ్రీవంగా అమోదించారు. నరసాపురం యూనిట్ కోశాధికారి స్వామి నాయుడు, తాలూకా యూనిట్ అధ్యక్షుడు ఎం.మార్కండేయులు, ఆర్.రామకృష్ణరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.హరనాథ కృష్ణ, పెన్షనర్లు పాల్గొన్నారు.
ఇంటింటా శ్రావణ శోభ
ఇంటింటా శ్రావణ శోభ
ఇంటింటా శ్రావణ శోభ
ఇంటింటా శ్రావణ శోభ
ఇంటింటా శ్రావణ శోభ
ఇంటింటా శ్రావణ శోభ
ఇంటింటా శ్రావణ శోభ