
ఓటరు జాబితా సవరణ ఆపాలి
సాక్షి కథనాలకు స్పందన
తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెంలో పారిశుద్ధ్య లోపం, రహదారుల మరమ్మతులపై ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. 8లో u
భీమవరం: ప్రత్యేక సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ఓటర్ల జాబితా సవరణను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలలో తన పెత్తనం కోసం ప్రతిపక్షాల ఓటు బ్యాంక్‌ను తొలగించడానికే సవరణను ఆయుధంగా చేసుకుందని, దానికి ఎన్నికల సంఘం వత్తాసు పలుకుతుందని విమర్శించారు. గతంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులను కూడా ఈ సవరణలో పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఐఆర్ సర్వేను దేశమంతా అమలు చేయాలని చూస్తుందని ఒక పక్క ఎన్నికల ప్రక్రియలో ఉన్న లోపాలపై చర్చ జరుగుతుండగా మరోపక్క సర్వే పేరుతో ఓటర్లను గందరగోళపర్చడం, తొలగించడం అన్యాయమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని స్వతంత్ర సంస్థగా కాకుండా కేంద్ర ప్రభుత్వం తన జేబు సంస్థగా మార్చేసిందని గోపాలన్ దుయ్యబట్టారు. తక్షణమే ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని నినాదాలు చేశారు. సీపీఎం జిల్లా నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ, ఇంజేటి శ్రీనివాస్, ఎం.ఆంజనేయులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణంరాజు, త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.