
గతంలో ఇక్కడే పరీక్ష రాశాను
నేను తితిదే వేదపాఠశాల ప్రధానాచార్యుడిగా పదవీ విరమణ చేశాను. 35 ఏళ్లుగా ఇక్కడ వేద పరీక్షలకు పరీక్షాధికారిగా వస్తున్నాను. వేదాల పరిరక్షణకు అందరూ కృషి చేయాలి. ప్రస్తుతం 30 మంది వేద విద్యార్థులను కృష్ణ యజుర్వేదంలో పరీక్షించాను.
–గుళ్లపల్లి విశ్వనాధ ఘనాపాఠీ, హైదరాబాద్
శుక్ల యజుర్వేద ప్రొఫెసర్‌గా..
మాది నేపాల్. చిన్నతనంలోనే అస్సాం వచ్చి వేద పాఠశాలలో వేద విద్యనభ్యసించాను. ప్రస్తుతం తిరుపతిలోని వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శుక్లయజుర్వేదంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. పది మంది వేద విద్యార్థులకు పరీక్ష నిర్వహించాను.
– గోవిందప్రసాద్ అధికారి, శుక్ల యజుర్వేద పరీక్షాధికారి
విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను
వేదపరీక్షలకు దశాబ్దకాలంగా పరీక్షాధికారిగా వస్తున్నాను. విశాఖపట్నంలో శుక్ల యజుర్వేదంలో శిక్షణ ఇస్తున్నాను. ఏటా ఒక బ్యాచ్ చొప్పున ఎంపిక చేసుకుంటాను. ఒక్కో బ్యాచ్‌కు పదకొండు సంవత్సరాలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
– రాపర్తి నరేంద్రకుమార్ ఘనాపాఠీ, విశాఖపట్నం
ఇక్కడి సర్టిఫికెట్లకు ప్రాధాన్యత
మాది రాజస్థాన్. అక్కడ రెండేళ్లు వేద విద్య, హైదరాబాద్‌లో రెండేళ్లు, కుంభకోణంలో ఏడాది, విశాఖపట్నం వేదపాఠశాలలో మూడేళ్లు సామవేదం అభ్యసించాను. ఇక్కడ ఉత్తీర్ణత సాఽధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంతో పరీక్ష రాయడానికి వచ్చాను.
– రోహిత్‌శర్మ, రాజస్తాన్
●

గతంలో ఇక్కడే పరీక్ష రాశాను