
తప్ప తాగించేందుకు పర్మిట్
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి, భీమవరం: మద్యం నుంచి సంపద సృష్టి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే బెల్టులు, సమయ పాలన లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ మద్యాన్ని ఏరులై పారి స్తోంది. మందుబాబుల్ని మరింత తప్పతాగించి ఆదాయాన్ని పెంచుకునే పనిలో ఉంది. షాపులకు అనుబంధంగా పర్మిట్ రూంల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. గీత కార్మికులకు చెందిన 18 షాపులతో కలిపి జిల్లాలో 193 మద్యం షాపులు ఉన్నాయి. నెలకు రూ.120 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. మునుపటి ఏడాది ప్రామాణికంగా 20 శాతం అమ్మకాలు పెంచాలంటూ మొదట్లో ఎకై ్సజ్ అధికారులకు టార్గెట్లు విధించేవారు. ప్రైవేట్ పాలసీ తెచ్చిన గత ఏడాది అక్టోబరు 16 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి లిక్కర్, బీర్లు అమ్మకాల్లో 30 శాతం నుంచి 80 శాతం పెరుగుదలను గుర్తించింది. మరింత ఆదాయాన్ని రాబట్టేందుకు నెలవారీ టార్గెట్ మొత్తాన్ని రూ. 175 కోట్లకు పెంచేసినట్టు సమాచారం. లక్ష్యాన్ని చేరేందుకు ఉన్నతస్థాయి నుంచి రోజువారీ సమీక్షలతో ఎకై ్సజ్ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
చూసీచూడనట్టుగా..
షాపుల వద్దనే మద్యం సేవించేందుకు వీలుగా టేబుళ్లు, కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు, మంచింగ్ కోసం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, సోడాలు, కూల్‌డ్రింక్స్, లూజ్ సేల్స్‌తో మద్యం దుకాణాలను ‘బార్’ల మాదిరి నిర్వహిస్తున్నారు. నైట్‌పాయింట్లు పేరిట తెల్లవార్లూ అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో పది వరకు బెల్టు విక్రయాలు షరామామూలే. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నా కూటమి నేతల ఒత్తిళ్లు, టార్గెట్ల కోసం అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. బెల్టుషాపులు లేవని ప్రభుత్వం చెబుతుండగా జిల్లాలో ఇప్పటి వరకు 370 మంది బెల్టుషాపుల నిర్వాహకులను అరెస్టుచేసి 800 లీటర్ల మద్యాన్ని ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
పర్మిట్‌కు పచ్చజెండా
సిండికేట్‌కు మేలుచేస్తూ 2014–19 మధ్య కాలంలో లిక్కర్ విధానాన్ని చంద్రబాబు సర్కారు మళ్లీ ఆచరణలో పెడుతోంది. అందులో భాగంగా మద్యాన్ని ప్రైవేట్ పరం చేసింది. షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు తెరిచే పనిలో ఉంది. సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్లకు లైసెన్సులు అమలుల్లోకి వచ్చాక పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.
జిల్లాలోని దాదాపు అన్ని షాపులకు పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకానున్నట్టు ఎకై ్సజ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాల వద్ద మద్యం సేవించడం నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికి సిండికేట్లు పర్మిట్ రూంల మాదిరి ఏర్పాట్లతో మద్యం, గ్లాసులు, వాటర్ బాటిల్స్, ఫాస్ట్‌ఫుడ్స్ తదితర అన్నిటి ధరలను పెంచేసి మందబాబులను దోచేస్తున్నారు. వీటిని అధికారికం చేయడం ద్వారా సిండికేట్ దోపిడీకి అడ్డుండదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చాలావరకు దుకాణాలు జనావాసాల మధ్యలో ఉండగా మందుబాబుల ఆగడాలతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. పర్మిట్ రూమ్‌తో వారు మరింత రెచ్చిపోయి స్థానికంగా ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తమవుతోంది.
న్యూస్‌రీల్
మద్యం నుంచి సంపద సృష్టిలో చంద్రబాబు సర్కారు
షాపుల వద్ద పర్మిట్ రూంలకు గ్రీన్‌సిగ్నల్
త్వరలో వెలువడనున్న ఆదేశాలు
ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
నాడు
వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం దుకాణాలు ఊరికి దూరంగా ఉండేవి. ప్రభుత్వమే నిర్వహించడం వలన నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేవి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి తీసుకుపోవడమే తప్ప అక్కడే కూర్చుని తాగే వీలుండేది కాదు. బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌లకు ఆస్కారమే లేదు. ఎమ్మార్పీకి మించి అధిక ధరల ఊసే లేదు. మద్యంపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరేది.
నేడు
కూటమి తెచ్చిన పైవేట్ పాలసీతో మద్యం దుకాణాలు జనావాసాలు, రద్దీ ప్రాంతాల్లోకి వచ్చేశాయి. ఊరురా బెల్టుషాపులు వెలిశాయి. క్వార్టర్ బాటిల్‌కు ఎమ్మార్పీపై మద్యం దుకాణాల్లో రూ.10, బెల్టుషాపుల్లో రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుండటంతో మందుబాబులు మత్తులో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఒక్కోసారి హత్యలకు సైతం దారితీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

తప్ప తాగించేందుకు పర్మిట్

తప్ప తాగించేందుకు పర్మిట్