
పైడిపర్రులో ప్రచారం చేస్తున్న మంత్రి కారుమూరి అల్లుడు దిలీప్
తణుకు టౌన్: త్వరలో జరిగే సాధారణ ఎన్నికలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరుతూ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అల్లుడు దిలీప్ బుదవారం సాయంత్రం తణుకు పైడిపర్రు ప్రాంతంలో ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిచారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఎన్నికలలో తణుకు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలను గెలిపించాలని కోరారు. ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి శివశంకర్, పట్టణ సచివాలయాల కన్వీనర్ ఇండుగపల్లి బలరామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, నాయకులు కొత్తపల్లి చరణ్, డీ హేమ శ్రీలత, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.