రైతుల సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం

Nov 28 2026 1:44 AM | Updated on Nov 28 2026 1:44 AM

రైతుల సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

దామెర: రైతులకు పూర్తి సహకారం అందించి, వారి సంక్షేమమే ప్రజాపాలన ప్రధాన ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఊరుగొండ (పెద్దాపూర్‌) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా చైర్మన్‌గా కమలాపురం రమేశ్‌తో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సేవలందించి, వారి సమస్యలు పరిష్కరించేలా కృషిచేయాలన్నారు. పీఏసీఎస్‌ను బలోపేతం చేయడానికి నూతన పాలకవర్గం కృషి చేయాలన్నారు. చైర్మన్‌ రమేశ్‌ మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారికి తగిన తోడ్పాటును అందించి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి మోహన్‌, నూతన సభ్యులు మన్నెం ప్రకాశ్‌ రెడ్డి, కౌడగాని ప్రసాద్‌, కత్తెరశాల రవీందర్‌, అంబి సాంబయ్య, మల్లాడి కృష్ణారెడ్డి, శనిగరం సుధాకర్‌, లంక రవీందర్‌, పోల్సాని అనిల్‌రెడ్డి, కోసనం కవిత, జంగిలి వేణు, గోవిందు విజయ, కర్కు వెంకటస్వామి, తహసీల్దార్‌ జ్యోతి వరలక్ష్మీదేవి, ఏఓ అల్లె రాకేశ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దుబాసి రాజేందర్‌, సీఈఓ శ్రీనివాస్‌, సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement