కాళోజీ సెంటర్ /ఖానాపురం : ఆటల పోటీలు విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తికి దోహదపడతాయని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పోటీలు ప్రారంభం కాగా శనివారం రంగశాయిపేట, నర్సంపేట, నల్లబెల్లి కళాశాలల మైదానాల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో ఆయన పాల్గొని, నిర్వహణను పరిశీలించి మాట్లాడారు. పలు కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్లు లేకున్నా అధ్యాపకులే బాధ్యత తీసుకొని పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమాల్లో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ సదానందం, గ్రంథ పాలకుడు సుధీర్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ పరాచికపు సదానందం, అధ్యాపకులు రవికుమార్, శోభ, తిరుపతమ్మ, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.


