గీసుకొండ : వరంగల్‌లోని ఐఎంఏ హాలులో రేపు (సోమవారం) నిర్వహించనున్న జిల్లా సదస్సును విజయవంతం చేయాలని మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్‌ఎఫ్) జిల్లా ఇన్‌చార్జ్ వంగూరి ఆనందరావు కోరారు. మండలంలోని మచ్చాపురంలో సమాఖ్య నర్సంపేట నియోజకవర్గ కోఇన్‌చార్జ్ ఇనుముల పూర్ణయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆనందరావు అతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ నాయకత్వంలో మూడు దశాబ్దాలకుపైగా సాగిన అలుపెరగని పోరాటాలు, త్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత లభించిందని తెలిపారు. రిజర్వేషన్ ఫలాలను పూర్తిస్థాయిలో అందుకోవాలంటే మాదిగ, ఉపకులాల విద్యార్థులు చదువే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు. విద్యావంతులైతేనే సమాజంలో సముచిత స్థానం, విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలిపారు. సమావేశంలో నాయకులు పరంజ్యోతి, ప్రశాంత్, పూర్ణచంద్రరావు, కోయిల మహేందర్, సానపల్లి రుషి, సంతోష్, బరిగల యశ్వంత్, సవరం దీవెన కుమార్, మామునూరు శివ, దొమ్మాటి సందీప్, తదితరులు పాల్గొన్నారు.


