‘మత్తు’ విముక్తే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

‘మత్తు’ విముక్తే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

Nov 29 2026 1:22 PM | Updated on Nov 29 2026 1:22 PM

‘మత్తు’ విముక్తే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

వర్ధన్నపేట : మత్తు పదార్థాల నుంచి దేశానికి విముక్తి కల్పించడమే నషా ముక్త్‌ భారత్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎకై ్సజ్‌ శాఖ అధికారి అజీజ్‌ అహ్మద్‌, ప్రభుత్వ వైద్యుడు దేవేందర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ రాజు తెలిపారు. మై భారత్‌ సంస్థ కోఆర్డినేటర్‌ నవీన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని మైనార్టీ కళాశాలలో నైబర్‌హుడ్‌ యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌తోపాటు కుటుంబ వ్యవస్థను, సమాజాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు. విద్యార్దులు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమాజంలోని ప్రతిఒక్కరూ ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. వ్యసనాలకు బానిసలుగా మారిన వారిని నిందించకుండా కౌన్సిలింగ్‌, వైద్య చికిత్స ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. సమావేశంలో అధ్యాపకులు సరిత, అనిత, రాయపర్తి యువజన సంఘం ప్రతినిధులు రాజు, విజయ్‌, అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement