ఖానాపురం : ఆపదలో ఉన్న వారిని కాపాడడానికి ఆంబులెన్స్ సిబ్బంది బాధ్యతాయుతంగా సేవలు అందించాలని 108 జిల్లా మేనేజర్ భరత్‌కుమార్ అన్నారు. ఈమేరకు మండల పరిధిలో 108 ఆంబులెన్స్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మందుల నిల్వలు, వాహనాల నిర్వహణ, సిబ్బంది పనితీరు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేగవంతమైన వైద్య సేవలందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు. కార్యక్రమంలో పైలెట్ సామాల మధు, సదానందం, తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటేషన్ రద్దు చేయాలి
నల్లబెల్లి : మండలంలోని మేడపల్లి ప్రభుత్వ హైస్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడి డిప్యూటేషన్‌ను రద్దు చేసి అదే పాఠశాలలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఏబీఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఈఓ అనురాధకు శనివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం నరేష్ మాట్లాడారు. ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపితే విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు.
ఏఓగా జావిద్ ఖాన్
పర్వతగిరి : మండల వ్యవసాయ అధికారి (ఏఓ)గా ఎండి.జావిద్ ఖాన్ శనివారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు సబ్సిడీ, సంక్షేమ పథకాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతోపాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి అంకితభావంతో పని చేస్తానని చెప్పారు.
రగ్బీ పోటీల్లో ప్రతిభ
నెక్కొండ : రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీల్లో మండల కేంద్రంలోని ఫాదర్ కొలంబో హైస్కూల్ విద్యార్థులు యశ్వంత్, అభినవ్, శ్రీరుధ్, రాహుల్, సాత్విక్‌రెడ్డి, శ్రీనాథ్, హర్షద్ ప్రతిభ చాటారని ప్రిన్సిపాల్ శ్రావణ్‌రెడ్డి తెలిపారు. సదరు విద్యార్థులను స్కూల్ ఆవరణలో శనివారం పీఈటీ శ్రీధర్, ఉపాధ్యాయులతో కలిసి ప్రిన్సిపాల్ అభినందించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారని చెప్పారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
సంగెం : ఇసుకను రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని రామచంద్రాపురం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా వర్థన్నపేట మండలంలోని ఇల్లంద నుంచి సంగెం మండల పరిధిలోని కోట వెంకటాపూర్ వైపు ఇసుకతో వెళ్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు తనిఖీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనాలు నడుపుతున్న ఇల్లంద గ్రామానికి చెందిన బాలగాని రాజు, మునుకుంట్ల మురళీపై కేసు నమోదు చేశామని, ట్రాక్టర్ల యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
విద్యుత్ స్తంభం
ఎక్కి హల్‌చల్
తొర్రూరు రూరల్ : కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మండలంలోని వెలికట్ట శివారులో విద్యుత్ స్తంభం ఎక్కి శనివారం హాల్‌చల్ చేశాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై మహేందర్‌రెడ్డి వెంటనే అక్కడికి చేరుకొని స్తంభంపై ఉన్న రాయపర్తి మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే యాకూబ్‌పాషాకు సర్ది చెప్పి కిందికి దింపి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
పూలేకు ఘన నివాళి
నర్సంపేట/నల్లబెల్లి : నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లో శనివారం మహాత్మ జ్యోతిరావుపూలే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేటలో జిల్లా ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి, బీసీ సంఘం నర్సంపేట గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పి.గోపాల్, టీపీఎఫ్ రాష్ట్ర నాయకుడు జనగాం కుమారస్వామి, బీసం సంఘం రాష్ట్ర నాయకులు బొడ్డు కిరణ్‌కుమార్, మోకు దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్, తదితరులు నివాళులర్పించారు. నల్లబెల్లిలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి, నాయకులు పరికి కోర్నెల్, తదితరులు నివాళులర్పించారు.కొర్నేల్, వైనాల జంపయ్య, పొడేటి సాగర్, బొట్ల మొగిలి, లొనే లింగయ్య, మాసంపల్లి ప్రభాకర్, కోడూరి సిద్దు, కనుకం భరత్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.


