ఆహారంలో పోషకాలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఆహారంలో పోషకాలు తప్పనిసరి

Nov 29 2026 1:22 PM | Updated on Nov 29 2026 1:22 PM

నర్సంపేట : ఆహారంలో పోషకాలు తప్పనిసరిగా ఉండాలని బాలాజీ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌రెడ్డి తెలిపారు. పోషకాహార దినోత్సవం సందర్భంగా పట్టణంలోని అక్షర ద స్కూల్‌, బాలాజీ ఇంటిగ్రేటెడ్‌ టీచింగ్‌ స్కూల్‌లో శనివారం నిర్వహించిన ఫుడ్‌ ఫెస్ట్‌లను విద్యాసంస్థల కోశాధికారి వనజతో కలిసి రాజేంద్రప్రసాద్‌రెడ్డి తిలకించి వివిధ రకాల పండ్లు, ఆహార పదార్థాల వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజేంద్రప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. ఆహారంలో పండు, కూరగాయలు, ఆకుకూరలు భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆరోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు. కార్యక్రమాల్లో విద్యాసంస్థల సెక్రటరీ డాక్టర్‌ రాజేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్లు రాజేంద్రప్రసాద్‌రెడ్డి, జ్యోతి, భవాని, ఏఓ సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement