పర్వతగిరి : స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలతో విద్యాప్రమాణాల పెంపునకు బాటలు పడతాయని అకడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీమ్ నోడల్ ఆఫీసర్ గాయపు లింగారెడ్డి తెలిపారు. మండలంలోని శనివారం నిర్వహించిన కొంకపాక,
ఏనుగల్లు పాఠశాలల కాంప్లెక్స్ సమావేశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. సమావేశాలు ఉపాధ్యాయుల బోధనా మెళకువలను మెరుగు పర్చుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఉపాధ్యాయులు సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీమ్ సభ్యులు చక్రవర్తుల నాగార్జున, కె.ఆనంద మోహన్, డాక్టర్ మడత భాస్కర్, మంద రాజు, తదితరులు పాల్గొన్నారు.


