రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

Nov 28 2026 1:44 AM | Updated on Nov 28 2026 1:44 AM

న్యూశాయంపేట: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. తెలంగాణ రోడ్డు భద్రత (నాన్‌ లాప్సబుల్‌ నిధి) నుంచి జిల్లాకు కోటి రూపాయలు కేటాయించినట్లు తెలి పారు. ఈ నిధులను రోడ్డు ప్రమాదాల భద్రతకు సంబంధించిన నిర్దేశిత కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌ స్పాట్లను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జంక్షన్ల అభివృద్ధి, రోడ్డు సూచికబోర్డులు, రోడ్డు మార్కింగ్‌ వంటి ఇంజనీరింగ్‌ సంబంధిత పనులు చేపట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎల్‌.కిశోర్‌కుమార్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి

వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా నిర్మూలనకు సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వెట్టిచాకిరీ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నివారణపై రెవెన్యూ, పోలీస్‌, కార్మిక, సంక్షేమ శాఖల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. వెట్టిచాకిరీలో మగ్గుతున్న వారికి రక్షణ కల్పించాలని అన్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీ వ్యవస్థీకృత నేరాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు బాధితులను గుర్తించే విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎంఎం సంస్థ డైరెక్టర్‌ సిస్టర్‌ సహాయ, రిసోర్స్‌ పర్సన్స్‌, అధికారులు పాల్గొన్నారు.

డిగ్రీ కాలేజీల్లో విద్యాప్రమాణాలు పెంచాలి

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యాప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించిన డిగ్రీ కళాశాలల కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. కమిటీ కన్వీనర్‌, నర్సంపేట కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ మల్లం నవీన్‌, అధికారులు పాల్గొన్నారు.

అధికారుల సమీక్షలో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement