మహిళలను కోటీశ్వరులను చేస్తాం.. | - | Sakshi
Sakshi News home page

మహిళలను కోటీశ్వరులను చేస్తాం..

Nov 28 2026 1:44 AM | Updated on Nov 28 2026 1:44 AM

కాళోజీ సెంటర్‌/గీసుకొండ : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొనాయమాకుల పీఎస్‌ ఆర్‌ గార్డెన్‌లో తెల్లరేషన్‌కార్డు ఉండి, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ సత్యశారదతో కలిసి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. తహసీల్దార్‌ ఎండీ రియాజుద్దీన్‌, ఎంపీడీఓ శ్రీధర్‌, పొదుపు సంఘాల మహిళలు, జిల్లా అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలను నిర్మూలించాలి..

బాల్య వివాహాలను నిర్మూలించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కోరారు. కొనాయమాకులలో శుక్రవారం జరిగిన బాల్య వివాహ్‌ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు చిన్న వయస్సులోనే వివాహ బంధంలోకి వెళ్లకుండా ఉన్నత విద్యనభ్యసించాలని కోరారు. కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ బాల్యవివాహాలు బాలల ఆరోగ్యం, విద్య, మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. వివాహానికి శారీరక, మానసిక పరిపక్వతతో పాటు బాధ్యతలను స్వీకరించే సామర్థ్యం అవసరమని పేర్కొన్నారు. చిన్న వయస్సులో వివాహం చేయడం ద్వారా పిల్లల బాల్యం, స్వేచ్ఛ, భవిష్యత్‌ను దూరం చేసినట్లవుతుందని అన్నారు. అనంతరం వంచనగిరి కస్తూర్బా బాలికల విద్యాలయ విద్యార్థినులు బాల్య వివాహాల దుష్పరిణామాలపై నాటిక ప్రదర్శించారు. జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ కె.వసుధ, ఇన్‌చార్జ్‌ డీసీపీఓ కల్యాణి పాల్గొన్నారు.

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

కొనాయమాకులలో ఇందిరమ్మ చీరల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement