వరంగల్
శనివారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2026
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం చలిగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువ ఉంటుంది. రాత్రి సమయంలో చలితోపాటు పొగమంచు కురుస్తుంది.
పథకాలు పాడి రైతులకు చేరాలి
ప్రభుత్వ పథకాలు పాడి రైతులకు చేరువ చేయాలని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ సూచించారు.
కేయూ క్యాంపస్: హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో శనివారం 24వ స్నాతకోత్సవం జరగనుంది. యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ప్రత్యేక వేదికను ముస్తాబు చేశారు. విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ శివప్రతాప్‌శుక్లా, ముఖ్యఅతిథిగా సైయంట్ సంస్థ వ్యవస్థాపకులు, పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. 290మంది అభ్యర్థులకు 408 బంగారు పతకాలు, 88మందికి పీహెచ్‌డీ పట్టాలు అందజేస్తారు. స్నాతకోత్సవ ఏర్పాట్లను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం పర్యవేక్షించారు.
అభ్యర్థులకు సూచనలు..
బంగారు పతకాలు అందుకోబోయే అభ్యర్థులు ఉదయం 7 నుంచి 9గంటల వరకు కేయూలోని దూరవిద్య కేంద్రం ద్వారా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలోకి ప్రవేశించి బంగారు పతకాలను స్వీకరించాల్సి ఉంటుంది.
● అభ్యర్థులు ఎక్కువమంది ఉన్నందున 14 బ్యాచ్‌లుగా చేశారు. ముందుగానే బంగారు పతకాలు స్వీకరించాక వాటిని తీసుకొని ఉదయం 9.20 గంటల్లోపు ఆడిటోరియంలోకి ప్రవేశించి తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి.
● బంగారు పతకాలతోనే బ్యాచ్‌ల వారీగా గవర్నర్‌తో ఫొటో సెషన్ కొనసాగుతుంది.
● పీహెచ్‌డీ పట్టాలు అందుకునే అభ్యర్థులు కూడా దూరవిద్య కేంద్రం ద్వారానే ఆడిటోరియంలోకి ప్రవేశించి కేటాయించిన సీట్లలో కూర్చోవాలి.
● వీరికి మాత్రం గవర్నర్ చేతులమీదుగా పీహెచ్‌డీ పట్టాల ప్రదానం ఉంటుంది.
● అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది కూడా వైట్ డ్రెస్ ధరించి రావాల్సి ఉంటుంది.
గవర్నర్ పర్యటన షెడ్యూల్ ఇలా..
● ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టునుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
● 10.30 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని హెలిపాడ్‌లో దిగుతారు.
● 10.40 గంటలకు వరంగల్ నిట్ వీఐపీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
● 10.55 గంటలకు బయలుదేరి 11 గంటలకు కేయూ
ఆడిటోరియానికి చేరుకుంటారు.
● స్నాతకోత్సవం కార్యక్రమంలో మధ్యాహ్నం 12.45 గంటలవరకు పాల్గొంటారు.
● 12.45 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కేయూ గెస్ట్‌హౌస్‌లో ఉంటారు. అక్కడే లంచ్ చేస్తారు.
● మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి ఆర్ట్స్ కాలేజీలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు.
● 2.10 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు
స్నాతకోత్సవం నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందితో వేసిన 12కమిటీలు నిర్వహణ చూసుకుంటాయి. యూనివర్సిటీలో నెలకొన్న వివిధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్యాంపస్‌లో, బయట 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లున్నవారికే ఆడిటోరియంలోకి అనుమతిస్తారు.
అతిథులు : రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్‌శుక్లా,
పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డి
పీహెచ్‌డీ అభ్యర్థులు : 88 మంది
బంగారు పతకాలు : 290 మందికి 408
విభాగాలు : ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, కామర్స్ అండ్
బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్,లా, ఇంజనీరింగ్
అండ్ టెక్నాలజీ, ఫార్మసీ, సైన్సెస్
విద్యాసంవత్సరాలు : 2021 నుంచి 2025 వరకు
నేడు కేయూ 24వ స్నాతకోత్సవం
ముస్తాబైన ఆడిటోరియం వేదిక
250మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు


