రీప్లేస్‌మెంట్‌పై సందిగ్ధం | - | Sakshi
Sakshi News home page

రీప్లేస్‌మెంట్‌పై సందిగ్ధం

Nov 28 2026 1:44 AM | Updated on Nov 28 2026 1:44 AM

హన్మకొండ: ఆర్టీసీ ప్రైవేట్‌ అద్దె బస్సుల రిప్లేస్‌మెంట్‌పై టీజీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పష్టత రావడం లేదు. మార్చి నాటికి వరంగల్‌ రీజియన్‌లో 146 బస్సుల అద్దెబస్సుల గడువు మీరనుంది. వీటి స్థానంలో కొత్త బస్సులు సర్దుబాటు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని అంచనా. ఇప్పటివరకు గడువు మీరిన అద్దె బస్సుల స్థానంలో ఆ బస్సుల యజమానులకే కొత్తవాటిని సమకూర్చే అవకాశం కల్పిస్తూ వస్తోంది. ప్రస్తుతం యాజమాన్యంనుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో అద్దె బస్సుల యజమానుల్లో ఆందోళన నెలకొంది. గడువులోగా రీప్లేస్‌మెంట్‌కు ఆనుమతి రాకుంటే సంస్థలో తీవ్ర బస్సుల కొరత నెలకొననుందని పరిశీలకులు భావిస్తున్నారు. కానీ, సంస్థ చూపు ఎలక్ట్రిక్‌ బస్సుల వైపు ఉందని తెలుస్తోంది.

ప్రైవేట్‌ యజమానుల వాదన..

అద్దె బస్సుల పార్కింగ్‌, నిర్వహణ బాధ్యత అద్దె బస్సుల యజమానులు చూసుకుంటున్నారు. కానీ, ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్టీసీనే స్థలం సమకూర్చి డిపో నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి విద్యుత్‌, పార్కింగ్‌ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. అద్దె బస్సులకు కిలో మీటరుకు సగటున రూ.30 చెల్లిస్తుండగా ఎలక్ట్రిక్‌ బస్సులకు సగటున రూ.62 చెల్లిస్తున్నట్లు సమాచారం. అద్దె బస్సులతో పోలిస్తే నిర్వహణ పరంగా, అద్దె చెల్లింపు పరంగా ఎలక్ట్రిక్‌ బస్సులు భారమని చెబుతున్నారు. కార్మిక యూని యన్లు కూడా ఎలక్ట్రిక్‌ బస్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే వరంగల్‌ రీజియన్‌లో వరంగల్‌–2 డిపో ద్వారా నడుపుతున్న ఎలక్ట్రిక్‌ బస్సులు రోజుకు 10 బస్సుల వరకు మరమ్మతు వస్తుంటాయని, ఎక్కడ ఆగిపోతాయో, ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితులున్నాయని అంటున్నారు. అదే ప్రైవేట్‌ బస్సులు అయితే సొంత నిర్వహణ కావడంతో సంస్థకు ఎటువంటి భారమూ పడదని చెబుతున్నారు.

వరంగల్‌ రీజియన్‌లో

మార్చిలో పూర్తి కానున్న

146 అద్దె బస్సుల గడువు

గడువులోగా అనుమతి రాకుంటే ఏర్పడనున్న బస్సుల కొరత

సంస్థ చూపు.. ఎలక్ట్రిక్‌ బస్సుల వైపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement