ప్రజాపాలనతోనే ప్రజాసంక్షేమం | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలనతోనే ప్రజాసంక్షేమం

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

● నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి

ఖానాపురం: కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ప్రజాపాలనతోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలో ఆదివారం 509 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుందన్నారు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 4,900 పింఛన్లు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాలాయి శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ హరిబాబు, నర్సంపేట ఆత్మ చైర్మన్‌ యడ్ల భిక్షంరెడ్డి, సొసైటీ చైర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్‌, తహసీల్దార్‌ రమేష్‌, ఎంపీడీఓ అద్వైత, ఎంపీఓ సునీల్‌, సర్పంచ్‌లు ఎలగందుల రాజు, దాసరి రమేష్‌, జాడి అచ్యుతం, వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

చెన్నారావుపేటలో..

చెన్నారావుపేట: ప్రభుత్వం చేయూత పథకంలో భాగంగా నూతన పింఛన్‌ మంజూరు పత్రాలను ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 691 మందికి వివిధ కేటగిరీలో పింఛన్లు మంజూరు అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాలాయి శ్రీనివాస్‌, మండల పార్టీ అధ్యక్షుడు సిద్దెన రమేష్‌, అధికారులు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement