కమ్మర్పల్లి(భీమ్‌గల్): నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియంలో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర అంతర జిల్లాల టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా జట్టు విజేతగా నిలిచింది. రన్నర్‌గా హనుమకొండ, తృతీయ స్థానంలో మంచిర్యాల జట్లు నిలిచాయి. సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి కే శోభన్‌బాబు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల క్రీడాకారులకు అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులను ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు పంపుతామన్నారు.


