బీపీటీ, జై శ్రీరామ్, తెలంగాణ సోనా వంటి ఉత్తమ రకాల సన్న బియ్యాన్ని సొసైటీ ప్రజలకు అందిస్తోంది. ఇప్పటికే యూరోప్ దేశాలకు వివిధ రకాల సన్న బియ్యాన్ని విజయవంతంగా ఎగుమతి చేసిన అనుభవం సంఘానికి ఉంది. అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల నుంచి విపరీతమైన అభ్యర్థనలు రావడంతో అక్కడి హార్వెస్ లింకు కో–ఆపరేటివ్ సంస్థ ద్వారా సరఫరా చేసేందుకు సిద్ధమయ్యాయి. అమెరికా నుంచి అన్ని అనుమతులు రాగానే తొలి విడతగా 25 టన్నుల నాణ్యమైన జై శ్రీరామ్ బియ్యాన్ని ఎగుమతి సన్నాహాలు జరుగుతున్నాయి.
– అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, అధ్యక్షుడు, ముల్కనూరు సహకార సొసైటీ


