ఈఎల్‌ఎస్‌ కాలనీలో ఛత్‌ పూజలు | - | Sakshi
Sakshi News home page

ఈఎల్‌ఎస్‌ కాలనీలో ఛత్‌ పూజలు

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

ఈఎల్‌ఎస్‌ కాలనీలో ఛత్‌ పూజలు నేడు కలెక్టరేట్‌లో పిల్లల గ్రీవెన్స్‌ రెండు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

కాజీపేట రూరల్‌: బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైల్వే ఉద్యోగులు ఈఎల్‌ఎస్‌ కాలనీలో ఆదివారం రాత్రి ఛత్‌ పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం 6 గంటలకు రెండోరోజు పూజా కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. రైల్వే ఈఎల్‌ఎస్‌ ఎంప్లాయీస్‌ సంఘ్‌ బ్రాంచ్‌ నుంచి రూ.5 వేలు ఛత్‌ పూజా కమిటీకి అందించినట్లు నాయకులు బల్వీందర్‌సింగ్‌, బి.మాధవరావు తెలిపారు. రైల్వే సీనియర్‌ డీఈఈ సూర్యనారాయణ, ఏడీఈఈ రాహుల్‌, ఏఐ రాజీవ్‌చౌదరి, కాజీపేట సీఐ శ్యాంసుందర్‌, మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, విజయశ్రీరజాలీ, ఛత్‌పూజ కమి టీ సభ్యులు రంజన్‌కుమార్‌యాదవ్‌, రాంనా రాయణ్‌కుమార్‌, ఆనంద్‌కుషన్‌, సరోజ్‌కుమార్‌, సురేశ్‌కుమార్‌, ప్రదీప్‌లోండే తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ అర్బన్‌: బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌లో పిల్లల గ్రీవెన్స్‌ నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపా రు. బాలల హక్కులపై అవగాహన పెంపొందించడంతో పాటు వారి సమస్యల పరిష్కారా నికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సహకారంతో సాధారణ గ్రీవెన్స్‌ ప్రాంగణంలోనే పిల్లల కోసం ప్రత్యేక డెస్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యం, పోషణ, రక్షణ, ప్రాథమిక సౌకర్యాలు, సంక్షేమ పథకాల లబ్ధి తదితర సమస్యలపై నేరుగా వినతిపత్రాలు సమర్పించాలని కలెక్టర్‌ కోరారు.

దరఖాస్తులు అందించాలి..

వరంగల్‌ అర్బన్‌: జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ టి.వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని కోరారు.

వరంగల్‌ కలెక్టరేట్‌లో..

న్యూశాయంపేట: వరంగల్‌ కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సత్యశారద తెలిపారు. అన్ని శాఖల అధికారులు గ్రీవెన్స్‌కు హాజరుకావా లని ఆమె ఆదేశించారు. ప్రజలు గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఓ సిటీ ఇండోర్‌ స్టేడియంలో ఉషూ పోటీలు

కాశిబుగ్గ: మహిళా కీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించాలనే లక్ష్యంతో వరంగల్‌ కాశిబుగ్గ ఓ సిటీలోని ఇండోర్‌ స్టేడియంలో అస్మిత ఉషూ ఖేలో ఇండియా ఆధ్వర్యంలో ఉషూ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 120 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇందులో గెలుపొందిన వారికి డీవైఎస్‌ఓ అనిల్‌కుమార్‌, అసోసియేషన్‌ అధ్యక్షుడు కై లాష్‌ యాదవ్‌, ఉషూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ ఉమర్‌, జిల్లా అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు చిప్ప వెంకటేశ్వర్లు పతకాలు, ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్‌.కోటేశ్వర్‌, ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ యాకూబ్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు, కోచ్‌లు పాల్గొన్నారు.

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌ మీదుగా చర్లపల్లి– దానాపూర్‌ మధ్య ప్రయాణించే రెండు ప్రత్యేక రైళ్లను పొడిగించి నడిపిస్తున్నట్లు ఆదివారం రైల్వే అధికారులు తెలిపారు. నవంబర్‌ 30న చర్లపల్లిలో బయల్దేరే చర్లపల్లి– దానాపూర్‌ (07051) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ కాజీపేటకు చేరుకొని వెళ్తుంది. డిసెంబర్‌ 1వ తేదీ మంగళవారం దానాపూర్‌లో బయల్దేరే దానాపూర్‌– చర్లపల్లి (07052) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ మరుసటి రోజు కాజీపేటకు చేరుకొని వెళ్తుందని అధి కారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement