కేయూ అభివృద్ధికి సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

కేయూ అభివృద్ధికి సహకరించాలి

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

కేయూ అభివృద్ధికి సహకరించాలి

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి పూర్వవిద్యార్థులు సహకరించాలని రిజిస్ట్రార్‌ రామచంద్రం కోరారు. కేయూ గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా 1978–1980 విద్యాసంవత్సరంలోని 10 విభాగాల పీజీ కోర్సుల బ్యాచ్‌ పూర్వవిద్యార్థుల సమ్మేళనం వర్సిటీలో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీసీ హాజరై మాట్లాడుతూ 1976లో స్థాపించిన కేయూ.. వివిధ దశల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. కాగా, 46 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఎండోమెంట్‌ లెక్చర్‌, విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం, విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌, ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. అప్పటి గురువులను పూర్వవిద్యార్థులు సన్మానించారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. కేయూ రిటైర్డ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఆచార్య వడ్డె రవీందర్‌ అధ్యక్షత వహించారు. మాజీ వీసీ విద్యావతి, మాజీ రిజిస్ట్రార్లు సాయిలు, పురుషోత్తమ్‌రావు, జగన్నాథ స్వామి, రిటైర్డ్‌ ప్రొఫెసర్లు విజయ, ఎస్‌ఎం రెడ్డి, రవీందర్‌రెడ్డి, పరాంకుశం, భాస్కర్‌, గంధర్‌రావు, మనోహర్‌, నరేందర్‌, రవీంద్రచారి, ఉప్పలయ్య, ఎం.కిష్టయ్య, ఆదిరెడ్డి, పూర్వ విద్యార్థులున్నారు.

పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో రిజిస్ట్రార్‌ ఆచార్య రామచంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement