హసన్‌పర్తి: త్వరలోనే మహిళా సంఘాలకు ఫంక్షన్ హాల్స్ నిర్మించి ఇస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కొత్త పింఛన్ల మంజూరు పత్రాలతో పాటు హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, వీఓ నూతన భవనాలను ఆదివారం ఆమె ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం ఉపాధి రంగాల్లో రాణించేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సంఘంలో ఉన్న ప్రతీ మహిళా వ్యాపారవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసి నిరుపేదల సంక్షేమానికి పాటుపడుతోందన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ పేర బీజేపీ ఇటు ఓటు చోరీ చేయడమే కాకుండా సీటును కూడా చోరీ చేస్తోందని ఆరోపించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కుడా చైర్మన్ గుండు సుధారాణి, స్థానిక సర్పంచ్ కృష్ణవేణి, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, మేర్గు రాజేశ్, బయ్యగోని కుమారస్వామి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, తోకల లక్ష్మారెడ్డి, శ్రీరాములుు, రఘు, డీఆర్డీఏ పీడీ శ్రీను, తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మదన్‌గౌడ్ పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
కొత్త పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ
మల్లారెడ్డిపల్లిలో జీపీ, వీఓ భవనాలు ప్రారంభం


