గీసుకొండ: హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న ఐదవ రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్స్‌లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా గీసుకొండ సీఐ డి.విశ్వేశ్వర్ ఎంపికయ్యారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు, కమిషనరేట్ల నుంచి మొత్తం 21 క్రికెట్ జట్లు పాల్గొననున్నాయి. విశ్వేశ్వర్ బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆల్ రౌండర్‌గా రాణిస్తుండడం, జట్టును ముందుకు నడిపించే సామర్థ్యం ఉండడంతో ఆయనను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జట్టును టోర్నీలో విజేతగా నిలపాలని సీపీ ఎన్.శ్వేత ఆకాంక్షించారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ఎస్ బాక్సింగ్ హాల్లో ఈనెల 12న ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్ ఎలైట్ పురుషుల, మహిళల బాక్సింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌కుమార్, కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు రూ.300 ఎంట్రీ ఫీజు చెల్లించి ఉదయం 7 గంటల వరకు హాజరుకావాలని, ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల మెమో వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎంపికై న బాక్సర్లు ఈనెల 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు.


