● డీఎం సరస్వతి
నర్సంపేట: శబరిమల వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు నర్సంపేట డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం.సరస్వతి తెలిపారు. ఈ మేరకు రాజుపేట గ్రామంలో మంగళవారం అయ్యప్పస్వాములకు అరటి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం శబరిమల యాత్ర వివరాలను తెలిపారు. బుకింగ్ కోసం 9959226052, 7382856034, 9704644543 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వాములు పాల్గొన్నారు.
నాగసుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
గీసుకొండ: మండలంలోని ఊకల్‌హవేలిలోని ప్రసిద్ధ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయాన్ని పలు రకాల పూలతో సుందరంగా అలంకరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తన కుమారుడు శ్రీమాన్‌తో కలిసి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చనలు, అభిషేకం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాజేశ్వర్‌రావు, సర్పంచ్ కక్కెర్ల సుభాష్, భక్తులు పాల్గొన్నారు.
విదేశాల్లో
ఉద్యోగ అవకాశాలు
● జిల్లా ఉపాధి కల్పన అధికారి సాత్విక
కాళోజీ సెంటర్: తెలంగాణ నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) అవకాశం కల్పిస్తోందని జిల్లా ఉపాధి కల్పన అధికారి సాత్విక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని నిర్మాణ రంగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుందన్నారు. ఇందులో జనరల్ హెల్పర్స్, షట్టరింగ్ కార్పెంటర్లు, స్టీల్ ఫిక్సర్లు, మేసీ్త్రలకు అవకాశం ఉందన్నారు. 22 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, సంబంధిత పనుల్లో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఉచిత వీసా, వైద్య పరీక్షలు, వసతి (ఒక గదిలో ముగ్గురికి) ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు టామ్‌కామ్.తెలంగాణ.జీవోవీ.ఇన్, 08035524946 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు. లేదా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలోనూ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఉపాధి కల్పన అధికారి తెలిపారు.
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు నందిని
వర్ధన్నపేట: మండలంలోని ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థిని, వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన మంద నందిని జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. ప్రస్తుతం చింతకుంటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న నందిని ఈ నెల 5, 6, 7 తేదీల్లో గోదావరిఖని పట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 వాలీబాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. దీంతో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టుకు ఎంపికై నట్లు ల్యాబర్తి హెచ్‌ఎం లింగం శైలజ, పీఈటీ జలగం రఘువీర్ తెలిపారు. డిసెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని శికర్ పట్టణంలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్నట్లు తెలిపారు. జాతీయస్థాయికి ఎంపికై న నందినితోపాటు పీ ఈటీ రఘువీర్‌ను పలువురు అభినందించారు.


