అంతర్గత మూల్యాంకనం నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

అంతర్గత మూల్యాంకనం నిర్వహించాలి

Nov 14 2026 7:51 AM | Updated on Nov 14 2026 7:51 AM

కాళోజీ సెంటర్‌: ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఇంటర్‌ బోర్డు నియమావళి ప్రకారం అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు మారిన సిలబస్‌ ప్రకారం అంతర్గత పరీక్షల రికార్డులను పరిశీలించి మూల్యాంకనం నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పలు కళాశాలల అడ్మిషన్లు, అంతర్గత పరీక్షల రికార్డులను పరిశీలించారు. కళాశాలలో విద్యార్థులు ప్రాక్టికల్స్‌ నిర్వహణకు సిద్ధపడే విధానాన్ని పరిశీలించారు. మారిన సిలబస్‌ ప్రకారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులకు 15 మార్కుల ప్రయోగ పరీక్ష ఉన్నందున ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ ప్రకారం త్వరలో నిర్వహించబోయే ప్రయోగ, థియరీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మార్కుల మెమోల్లో విద్యార్థుల శాశ్వత విద్యా సంఖ్య (పర్మనెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌) ముద్రించనున్నందున అన్ని కళాశాలలు వెంటనే ఫొటో చెక్‌ లిస్టుల్లో పెన్‌ నంబర్లను నవీకరించుకోవాలన్నారు. జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 5,953, ద్వితీయ సంవత్సరంలో 6,142 మంది అడ్మిషన్‌ పొంది ఉన్నారని, మంగళవారం నాటికి 12,300 మందికి గాను 8,897 మంది (72 శాతం) విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారన్నారు.

డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement