రాయపర్తి: మండలంలోని కొలన్‌పల్లి గ్రామంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీజీఎంసీ సభ్యుడు డాక్టర్ నరేష్కుమార్, కో ఆప్ట్ స భ్యుడు వెంకటస్వామి మాట్లాడుతూ గ్రామానికి చెందిన మాచర్ల సుధాకర్ అనే వ్యక్తి ఎలాంటి వైద్య విద్యార్హతలు లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు ఆరోపణల మేరకు తనిఖీ చేసినట్లు తెలిపారు. రోగులకు అధిక మోతాదులో యాంటిబయాటిక్స్, స్టిరాయిడ్స్, నొప్పి నివారణ మందులు వినియోగిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా వైద్య కేంద్రాన్ని నిర్వహిస్తూ ఆస్పత్రి తరహాలో బెడ్లు ఏర్పాట్లు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తనిఖీలో గుర్తించామన్నారు. సుధాకర్‌పై చట్టపరమైన చర్యలు నిమిత్తం టీజీఎంసీకి సిఫార్సు చేశామన్నారు. గ్రామాల్లో నకిలీ వైద్యులు అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తిస్తే 9154382727 నంబర్‌కు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.


