న్యూశాయంపేట: వ్యవసాయ సాంకేతిక యాజ మాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న కిసాన్ మేళాకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కిసాన్ మేళా నిర్వాహణకు సంబంధించిన ముందస్తు ప్రణాళిక ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఎల్‌నినోపై అవగాహనతో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆరుతడి పంటల సాగు ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకుంటూ మెరుగైన దిగుబడులు సాధించే విధానాలను వివరించాలన్నారు. రైతులకు అవసరమైన సమాచారం ప్రభుత్వ పథకాలు సాంకేతిక సలహాలు ఒకే వేదికపై అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆత్మా పీడీ విజయనిర్మల, డీసీఓ నీరజ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఆనందం, ఆర్‌డబ్లుఎస్ ఈఈ నిర్మల, ఉద్యానవన శాఖాధికారి శ్రీనివాస్‌రావు, వ్యవసాయశాఖాధికారి విజయ్‌భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


