గ్రంథాలయాల అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాల అభివృద్ధే లక్ష్యం

Nov 14 2026 7:51 AM | Updated on Nov 14 2026 7:51 AM

కాశిబుగ్గ: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మీసాల ప్రకాశ్‌ అన్నారు. మంగళవారం వరంగల్‌ ఎల్లంబజార్‌లో జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ బడ్జెట్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నూతన భవన నిర్మాణానికి స్థల సేకరణతో పాటు అభివృద్ధికి ఎమ్మెల్యే కొండా సురేఖ సహకారంతో సీఎం దృష్టికి తీసుకువచ్చి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలోని శాఖ గ్రంథాలయాలకు నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే, ఎంపీ, నిధులతోపాటు ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడానికి సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. ఆయా శాఖ గ్రంథాలయాల్లో సిబ్బంది ఖాళీల భర్తీకి ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తానన్నారు. ఈ సందర్భంగా 2026–2027 సంవత్సరానికి గాను జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ వరంగల్‌ బడ్జెట్‌ను చర్చించి, మొత్తం రూ.87,92,453ల బడ్జెట్‌ను ఆమోదించారు. అలాగే భవన నిర్మాణాలకు రూ.30లక్షలు, పుస్తకాల కొనుగోలు రూ.5.60 లక్షలు, ఫర్నిచర్‌ కొనుగోలుకు రూ.3 లక్షలు కెటాయించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.బుగ్గారెడ్డి, డీఈఓ ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి కల్పన, డీపీఆర్‌ఓ బి.ప్రేమలత, జిల్లా వయోజన విద్య అధి కారి జె.రమేస్‌రెడ్డి, గ్రేడ్‌–1 లైబ్రేరియన్‌ వి.అర్జున్‌, మేకల చిన్నబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌

మీసాల ప్రకాశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement