వర్ధన్నపేట: ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేలా సిబ్బంది కృషి చేయాలని వెస్ట్‌జోన్ డీసీపీ రాజా మహేంద్ర నాయక్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేసి, వారి క్రమశిక్షణ, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల ప్రధాన ఉద్దేశం స్టేషన్ పనితీరును సమీక్షించి, సిబ్బందికి తగిన దిశానిర్దేశం చేయడమేనన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వెస్ట్‌జోన్ డీసీపీ రాజామహేంద్ర నాయక్


