ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు 82.39 శాతమే | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు 82.39 శాతమే

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

● సంగెం ప్రథమం.. దుగ్గొండి చివరి స్థానం

కాళోజీ సెంటర్‌: పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ముఖ గుర్తింపు ఆధారిత హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) జిల్లాలో 82.39 శాతమే నమోదవుతోంది. ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు (8 పని దినాలు) నమోదైన గణాంకాల ప్రకారం జిల్లా సగటు హాజరు శాతం నమోదైంది. ఇంకా 17.61 శాతం మంది పాఠశాలలకు డుమ్మా కొడుతున్నట్లు స్పష్టమవుతోంది. విధులకు హాజరుకాని ఉపాధ్యాయులు, సిబ్బందిపై నిఘా లేకపోవడంతో కనీసం 90 శాతం హాజరుకూడా నమోదు కాలేదని తెలుస్తోంది. కాగా, జిల్లాలో సంగెం మండలం ప్రథమ స్థానం, దుగ్గొండి చివరి స్థానంలో నిలిచింది. నవంబర్‌ 3న జిల్లాలో అత్యధికంగా 87.40 శాతం హాజరు, 7న అత్యల్పంగా 76.11 శాతం మాత్రమే నమోదైంది.

హాజరుశాతం పెంచేందుకు చర్యలు

జిల్లాలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. ఉపాధ్యాయులు, సిబ్బంది సక్రమంగా పాఠశాలలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. హాజరు శాతం 82.39 మాత్రమే నమోదైంది. తక్కువ హాజరు నమోదైన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి, హాజరుశాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.

– ఎన్‌.ప్రశాంత్‌రెడ్డి, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement