రూ.308 వేతనం వచ్చేలా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

రూ.308 వేతనం వచ్చేలా పనిచేయాలి

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

సంగెం: గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు రోజుకు రూ.308 వేతనం వచ్చేలా పనిచేయాలని డీఆర్‌డీఓ నాగపద్మజ సూచించారు. మండలంలోని కాపులకనిపర్తిలో వీబీజీ రాంజీ ఫీడర్‌ చానల్‌ పనులు చేస్తున్న కూలీలతో శుక్రవారం ఆమె మాట్లాడారు. కాట్రపల్లిలో వీఓ భవనం పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో వంద మందికి తక్కువ కాకుండా కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలని ఫీల్డ్‌అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ముమ్మడివరంలో చెరువు పూడికతీత పనులు తనిఖీ చేశారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు సదిరం చంద్రమౌళి, వర్కాల శ్రావణి, నాల్లం వీరస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement