ఐనవోలు: ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలందిస్తూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా విధులు నిర్వహించాలని సీపీ శ్వేత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఐనవోలు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. సిబ్బంది నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ ఆవరణలో కొబ్బరి మొక్క నాటారు. పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల వివరాలు, విచారణ నివేదికలు, స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లు, కిట్ ఆర్టికల్స్‌ను సీపీ పరిశీలించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయం ఉన్నందున, ఇక్కడికి వచ్చే భక్తుల మనోభావాలను, ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ సంతోశ్, ఎస్‌ఐలు అశోక్, వంశీకృష్ణ, రాజ్‌కుమార్‌తో పాటు ఐనవోలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసులు మెరుగైన సేవలందించాలి..
వరంగల్ సీపీ శ్వేత


