కాశిబుగ్గ: జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని డీఎంహెచ్ఓ బి.రాజారెడ్డి ఆదేశించారు. జిల్లాలోని పైడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. రికార్డులు, ఆన్లైన్ పోర్టళ్లలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలని, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఆస్పత్రికి వచ్చే ప్రతీ రోగికి సకాలంలో వైద్యసేవలు అందించాలని, మందులు, వ్యాక్సిన్ల నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అలాగే ఆస్పత్రిలోని ఔట్ పేషంట్ విభాగం, ల్యాబోరేటరీ, ఫార్మసీ, వ్యాక్సిన్ నిల్వ చేసేత ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్, వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు.
డీఎంహెచ్ఓ రాజారెడ్డి


