నా భార్య చనిపోయి రెండు నెలలు కావొస్తోంది. రైతుబీమా గురించి వ్యవసాయ అధికారులను కలిస్తే ఆన్లైన్ చేస్తామని బీమాకు సంబంధించిన పత్రాలు ఇవ్వమంటే ఇచ్చాను. బీమా డబ్బుల కోసం మరోసారి అధికారులను కలిస్తే ప్రభుత్వం రైతుల పేరుపై బీమా ప్రీమియం చెల్లించలేదు, ఆగస్టు వరకే ఆపివేసింది, తాము ఆన్లైన్ చేసి పెడతామని బీమా డబ్బులు వస్తాయో రావో తెలియదని వ్యవసాయ అధికారులు అంటున్నారు. గత ప్రభుత్వం రైతు మృతి చెందిన వెంటనే వారం రోజుల్లో బీమా డబ్బులు నామినీ ఖాతాల్లో జమ చేసేది. ప్రభుత్వం చొరవ తీసుకొని బీమా డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
అంబరకొండ రాజేశ్వర్రావు,
ఆరెపల్లి, శాయంపేట మండలం


