అడ్డగోలుగా పార్కింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా పార్కింగ్‌

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

అడ్డగోలుగా పార్కింగ్‌ అవస్థలు పడుతున్న ప్రయాణికులు

హన్మకొండ : హనుమకొండ జిల్లా బస్‌ స్టేషన్‌ వద్ద అడ్డగోలు ఆటోల పార్కింగ్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్‌ స్టేషన్‌కు ప్రయాణికులను తీసుకువచ్చే సహాయకులు, కుటుంబ సభ్యుల కోసం బైక్‌ పార్కింగ్‌ కల్పించిన స్థలంలో, బస్‌ స్టేషన్‌లోకి వెళ్లే దారికి అడ్డంగా ఆటోలు నిలపడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్టాండ్‌ చౌరస్తా నుంచి హనుమాన్‌ టెంపుల్‌ వైపు వెళ్లే రోడ్డుపై ఇష్టానుసారంగా ప్రైవేట్‌ వాహనాల పార్కింగ్‌తో రోడ్డు ఇరుకుగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను బస్టాండ్‌లోకి తీసుకు వెళ్లేందుకు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమరుపాటుగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. బస్సు వెళ్లేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా రోడ్డుపై ఆటోలను అడ్డంగా పార్కింగ్‌ చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

బస్‌ స్టేషన్‌ వద్ద ఆటోలు అడ్డంగా పార్కింగ్‌ చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీసీ యాజామాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రైవేట్‌ వాహనాల నుంచి మామూళ్లు వసూలు చేస్తూ తమకేమి పట్టనట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు ఆర్టీసీ వరంగల్‌ రీజినల్‌ అధికారులు సైతం చోద్యం చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ట్రాఫిక్‌ నియంత్రణ పట్టని పోలీసులు

చోద్యం చూస్తున్న ఆర్టీసీ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement