విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలి

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

● జిల్లా విద్యాశాఖాధికారి

ఎల్వీ గిరిరాజ్‌గౌడ్‌

● పరకాలలో జిల్లా పరిషత్‌

బాలుర ఉన్నత పాఠశాల తనిఖీ

పరకాల: పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్వీ గిరిరాజ్‌గౌడ్‌ ఉపాధ్యాయులకు సూచించారు. పరకాల పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. 6వ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాప్రగతిని తెలుసుకున్నారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు పదో తరగతిలో ప్రతిభ కనబరచాలని సూచించారు. పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి సిలువేరు సురేందర్‌, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement