మా అమ్మ కలకోటి మరియమ్మ (58) అనారోగ్యంతో ఆగస్టు 19న చనిపోయింది. మాకు తండ్రి, అన్నదమ్ములు ఎవరూ లేరు. ఇద్దరం ఆడపిల్లలమే. సొంత ఇల్లు, ఆస్తులు లేకపోవడంతో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాం. నా భర్త బట్టల షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మా అమ్మకు రైతుబీమా అర్హత ఉందని, రెండు నెలల్లో డబ్బులు వస్తాయని ఏఈఓ చెప్పారు. కానీ, ప్రభుత్వం రైతుబీమాను రెన్యువల్ చేయకపోవడంతో మాకు సొమ్ము నిలిచిపోయింది. ఆ డబ్బులు వస్తే నా ఇద్దరు చిన్న పిల్లల చదువులకు, మా అక్కాచెల్లెళ్ల కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉండేది. ప్రభుత్వం వెంటనే రైతుబీమాను రెన్యువల్ చేసి మాలాంటి పేద కుటుంబాలను ఆదుకోవాలి.
– కల్పన, గర్మిళ్లపల్లి, ఐనవోలు మండలం


