గీసుకొండ: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పాడి పశువుల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక అధికారి డాక్టర్ జి.సంపత్‌రావు పాడి రైతులకు సూచించారు. మండలంలోని బొడ్డు చింతలపల్లి గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్థక శాఖ అధికారులు బుధవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి.సంపత్‌రావు మాట్లాడుతూ కృత్రిమ గర్భధారణ చేయించడం ద్వారా ఆడ దూడలను పొందవచ్చని తెలిపారు. స్థానిక పశువైద్యుడు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గోపాలమిత్ర సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, లింగ నిర్ధారణ వీర్యం అందుబాటులో ఉందని తెలిపారు. సర్పంచ్ పోగుల అనిత మాట్లాడుతూ రైతులు పశుగ్రాసం సాగు చేయాలని సూచించారు. పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం ఎకరాకు రూ.14 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. ఈ శిబిరంలో 87 పాడి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జేవీఓలు హేమలత, ఉమా, ఎల్ఎస్ఏ రమేశ్, గోపాలమిత్ర సూపర్వైజర్ ఎండీ జహంగీర్, గోపాలమిత్రులు బండి సుధీర్, తుప్పరి అనిల్ కుమార్, ఎండీ అక్బర్, ఇంటాస్ కంపెనీ ప్రతినిధులు ఎం.అజయ్, శ్రీధర్, పాడి రైతులు పాల్గొన్నారు.
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక అధికారి డాక్టర్ జి.సంపత్‌రావు


