న్యూశాయంపేట: విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మైనారిటీ సంక్షేమశాఖ బుధవారం నిర్వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఆజాద్ ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం ఆజాద్ చిత్రపటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎల్.కిశోర్‌కుమార్, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎండబ్ల్యూఓ టి.రమేశ్, డీఈఓ ప్రశాంత్‌రెడ్డి, డీఐఈఓ శ్రీధర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
టీజీపీఎస్సీ చైర్మన్‌ను కలిసిన కలెక్టర్
టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంను హనుమకొండ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.


