రాజకీయ ఉనికి కోసమే విమర్శలు | - | Sakshi
Sakshi News home page

రాజకీయ ఉనికి కోసమే విమర్శలు

Nov 12 2026 5:24 AM | Updated on Nov 12 2026 5:24 AM

వేలేరు : రాజకీయ ఉనికి కోసమే తనపై బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శలు చేస్తున్నారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. డిసెంబర్‌ చివరి నాటికి గండి రామారం లిఫ్ట్‌–1 పనులు పూర్తి చేసి వేలేరు, చిల్పూర్‌ మండలాలకు గోదావరి జలాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బుధవారం వేలేరులో కాంగ్రెస్‌ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం, గ్రామ కమిటీల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమవేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి నియోజక వర్గానికి చేసిందేమి లేదని, అవినీతిని పెంచి పోషించారని, పథకాలు, నిధులు, పదవులు అన్ని అమ్ముకుని అక్రమంగా సంపాదించారని విమర్శించారు. నాడు ఎమ్మెల్సీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కేవలం తన గ్రామానికే సాగునీరు తెచ్చుకున్నాడని పరోక్షంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డిపై విమర్శలు చేశారు. వేలేరు నుంచి శాలపల్లి, పీచర, మద్దెలగూడెం మీదుగా కొమ్ముగుట్ట వరకు రూ.14 కోట్లతో హ్యమ్‌ రోడ్డు మంజూరై టెండర్‌ కూడా పూర్తయిందని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాల భవనాలకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే వాటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తానని తెలిపారు. నారాయణగిరి నుంచి పీచర క్రాస్‌ రోడ్డు వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి కృషిచేస్తానని వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఓర్వలేక బీఆర్‌ఎస్‌ పార్టీ ఫేక్‌ ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

డిసెంబర్‌ నాటికి గండి రామారం లిఫ్ట్‌ ట్రయల్‌ రన్‌ చేయిస్తా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement