ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి
ఆత్మకూరు : మండలవ్యాప్తంగా నీటి సంరక్షణ, ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రావొద్దని, అధికారులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అధికారులు, సిబ్బంది గ్రౌండ్ వాటర్ లెవల్ తెలుసుకోవాలన్నారు. నీటి వసతి లేకుంటే పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించాలన్నారు. ప్రతిపక్షాలు కావాలని విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. తాగునీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. పశుగ్రాసం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొ ద్దన్నారు. కొత్త బోరుబావులకు అనుమతి లేదని బో ర్లు వేస్తే ఫిర్యాదు చేయాలన్నారు. నీరు వృథా చేస్తే ఫిర్యాదు చేయాలని, జరిమానా విధించాలన్నారు. వీబీజీ రామ్‌జీ పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. మండల ప్రత్యేక అధికారి హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఈలు భానుకుమార్, సంపత్, మండల వైద్యాధికారి స్పందన, పశువైద్యాధికారి వింధ్య, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.


