సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి

Nov 10 2026 1:37 AM | Updated on Nov 10 2026 1:37 AM

ఎస్‌హెచ్‌జీలపై విచారణ చేయాలి

న్యూశాయంపేట: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్‌లో ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. దీపావళి పండుగ మరుసటి రోజే ప్రజావాణి ఉండటంతో ప్రజలు తక్కువ సంఖ్యలో హాజరై వినతులు అందించారు. ప్రజావాణికి మొత్తంగా 56 అర్జీలు రాగా వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖ–22, మున్సిపల్‌ కార్పొరేషన్‌–8, డీఆర్‌డిఏ–4, హౌసింగ్‌–3, ఎంజీఎం–3, వివిధ శాఖలకు సంబంధించి 16 దరఖాస్తులు సమర్పించారు. అదనపు కలెక్టర్లు ఎల్‌.కిశోర్‌ కుమార్‌, వై.వీ.గణేష్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ వసంత, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సత్యశారద

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని స్వయం సహాయ సంఘాల్లో గ్రామ, మండల, జిల్లా సమాఖ్యల్లో నాయకత్వ మార్పిడి చేయాలి. మార్పిడి లేకపోవడంతో కొంత మంది లంచాలు ఎరవేసి దీర్ఘకాలంగా నాయకత్వ స్థానాల్లో (ఆఫీస్‌ బేరర్స్‌గా) కొనసాగుతున్నారు. అక్రమ ప్రయోజనాలు పొందడంపై పూర్తిస్థాయి విచారణ, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.

– అరుణ్‌సింగ్‌, నల్లబెల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement